తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీరాజ్​ శాఖలో 311 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా - new jpbs

పంచాయతీరాజ్​ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. కొత్తగా 311 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీరాజ్​ శాఖలో 311 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

By

Published : Aug 22, 2019, 11:08 PM IST

పంచాయతీరాజ్​ శాఖలో కొత్తగా 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్త జిల్లాలు, మండలాల నేపథ్యంలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. 23 జిల్లా పరిషత్​ సీఈవో, 23 డిప్యూటీ సీఈవో, 23 జిల్లా పరిషత్​ అధికారుల పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. 40 డివిజనల్​ పంచాయతీ అధికారులు, 101 ఎంపీడీవో, 101 మండల పంచాయతీ అధికారుల ఉద్యోగాల భర్తీకి అనుమతి మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

పంచాయతీరాజ్​ శాఖలో 311 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా
ఇదీ చూడండి: కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details