హైదరాబాద్ బాగ్లింగంపల్లి తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు సాయిబాబు, చుక్కా రాములు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి పట్ల తీసుకున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.
'జీతంతో కూడిన సెలవులకు ఆదేశాలివ్వాలి'
రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర సమితి నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో జారీ చేసిన 4779 జీవోను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పలు రంగాల్లో అసంఘటిత కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారికి సెలవులతో కూడిన జీతం చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
'జీతంతో కూడిన సెలవులకు ఆదేశాలివ్వాలి'
వైరస్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న ఆస్పత్రి సిబ్బంది, ఇతర ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి రక్షణ కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పలు రంగాల్లో అసంఘటిత కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వారికి సెలవులతో కూడిన జీతం చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఇదీ చూడండి :కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు