సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బత్తాయి రైతులను ఆదుకోవాలనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచన మేరకు... శివ రామ కృష్ణ ట్రస్ట్ ముందుకు వచ్చింది. రైతుల నుంచి బత్తాయిలను కొనుగోలు చేసి... నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అధికారులకు అందించింది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 5,500 మంది పోలీసులకు 25 టన్నుల బత్తాయి పండ్లు పంపిణీ చేశారు.
''శివ రామ కృష్ణ ట్రస్ట్ వారు రైతుల నుంచి బత్తాయిలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో విటమిన్-సీ ముఖ్యపాత్ర వహిస్తుందని ముఖ్యమంత్రి సూచించగా... వాటిని నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అందిచండం గొప్ప విషయం. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు. 'ప్రజలందరూ కరోనాపై పోరాడాలి. విటమిన్ సీ ఉన్న పండ్లను అధిక మోతాదులో తీసుకోవాలి. లాక్డౌన్ పాటిస్తూ... ఇంటి నుంచి బయటకు రాకుండా సహకరించాలి.''