Opposition Parties Telangana Elections Campaign 2023 : టీపీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతురావు, మల్లు రవి.. బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటే..కాంగ్రెస్‌కు ఓటేయాలని గాంధీభవన్ వేదికగా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారం ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలో హస్తం అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీనాయక్.. ఇంటింటికీ తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎమ్మెల్యే సీతక్క గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీజేపీ - జనసేన మధ్య తేలిన సీట్ల లెక్క, తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
Telangana Assembly Elections 2023 : హనుమకొండ జిల్లా పరకాల అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్.. తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడు పాయలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు తనను గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజుర్నగర్లో రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
నారాయణపేటలోని హనుమాన్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్నికరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రరెడ్డి గెలుపే లక్ష్యంగా.. పార్టీ శ్రేణులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. మరోవైపు ఈటల పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం హుజురాబాద్‌లో.. ఆయన సతీమణి జమున ప్రచారం నిర్వహించారు.