Opposition parties Telangana Elections Campaign 2023 : రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా జోరు పెంచి దూసుకెళ్తున్న విపక్షాలు.. ప్రచారాలతోనూ హోరెత్తిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడా డివిజన్ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మలక్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌కు టికెట్ ప్రకటించడంతో.. దిల్లీ నుంచి వచ్చిన నేతకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బాహ్యవలయ రహదారి టోల్‌గేట్ వద్ద కార్లతో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Congress Election Campaign in Telangana 2023 :కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల గెలుపునకు కృషి చేయాలని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్ షమా కోరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని.. కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి పామేన భీమ్ భరత్ అన్నారు. చెవేళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని తెలిపారు.
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు
Telangana Assembly Elections 2023 : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింగపురం ఇందిర నామినేషన్ వేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య నివాసంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కాంగ్రెస్‌లో చేరారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో పార్టీ కార్యాలయాన్ని నారాయణ రావు పటేల్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి జీఎం గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మన పోటీ కారు గుర్తు అభ్యర్థితో కాదని.. సిద్దిపేట నుంచి వచ్చే మంత్రితో అని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో దొరలపాలన కావాలా? ప్రజల పరిపాలన కావాలా ప్రజలు తేల్చుకోవాలి? అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.