Opposition Parties Telangana Elections Campaign 2023: ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో రాజకీయ కోలాహాలం నెలకొంది. ఎన్నికల గడువు నెల రోజులు కూడా లేకపోవటంతో.. తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుబోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశానికి ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. పార్టీ ప్రకటించిన 6గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు వారు దిశానిర్దేశం చేశారు.
Telangana Election Campaign 2023 : మల్కాజిగిరి పరిధిలోని వెంకటాపూర్ డివిజన్‌లో నియోజకవర్గకాంగ్రెస్అభ్యర్థి మైనంపల్లి హనుమంతురావు పాదయాత్ర చేస్తూ.. ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ పీర్జాదిగూడలో మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి షామా మహ్మద్, నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్‌తో కలిసి పర్యటించారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వైఎస్‌ఆర్‌టీపీ ఔట్ - కాంగ్రెస్‌కు మద్దతు
CongressTelangana Elections Campaign 2023 :బీసీలపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీఎచ్ విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్‌ను గాలి అనిల్ కుమార్‌కు ఇవ్వకపోవటాన్నినిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. తొలి రోజు ప్రచారంలో భాగంగా కటాక్షపూర్, హౌస్ బుసర్గు, కందిబండ, నీరుకుల్ల, పెంచికలపేట, కామారం, పెద్దాపూర్ గ్రామాల్లో పర్యటించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్నికారెడ్డి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు పోలీసులు అధికారులు అధికార బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని తక్షణమే బదిలీ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఆయన పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అంబర్‌పేట్‌లో సమావేశం ఏర్పాటు చేసిన పార్టీ అభ్యర్థి కృష్ణయాదవ్.. నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు.