తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్​ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు - తెలంగాణలో విపక్షాల జోరు ప్రచారం

Opposition Parties Slams On BRS Party : తెలంగాణలో కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విపక్షాలు తీవ్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రచారాల్లో అధికారపార్టీ వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూ.. తాము అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధిని తెలియజేస్తున్నారు.

Main Parties Campaign in Telangana
Opposition Parties Slams On BRS Party

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 7:29 PM IST

Opposition Parties Slams On BRS Party అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్షాలు బీఆర్​ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి అభ్యర్థుల ప్రచారాలు

Opposition Parties Slams On BRS Party :బీఆర్​ఎస్​ను గద్దె దించి తెలంగాణలో విజయ కేతనం ఎగరేయడమే లక్ష్యంగా విపక్షాలు పని చేస్తున్నాయి. ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఆరు గ్యారంటీల హామీతో కాంగ్రెస్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండగా (Election Campaign in Telangana) బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ రణరంగంలోకి దూకింది. ఎంఐఎం, బీఎస్పీ సైతం ఓటర్లను ఆకర్షించేలా కసరత్తులు ప్రారంభించాయి.

పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుప్పలు కావాలా?: కేసీఆర్

దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడులో పెద్దగా సత్తా చాటని కాంగ్రెస్‌ కర్ణాటక విజయంతో ఒక్కసారిగా జోష్‌లోకి వచ్చింది. బీఆర్​ఎస్​ను హోరాహోరి ఢీ కొడుతూ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఆరు గ్యారంటీలకు జనంలో సానుకూల పవనాలు వస్తుండటంతో ప్రచార జోరు పెంచింది. హైదరాబాద్‌ అల్లాపూర్‌లో ప్రచారం నిర్వహించిన బండి రమేశ్‌ కూకట్‌పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చేలా కృషి చేయాలని నిర్మల్‌ అభ్యర్థి శ్రీహరి రావు ప్రజలను కోరారు.

Main Parties Campaign in Telangana :ఆర్మూర్‌ అభ్యర్థి వినయ్‌రెడ్డికిప్రచారంలో భాగంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం జరిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచార రథంలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రచారం నిర్వహించిన టిఫిన్‌ బండిపై పూరీలు వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.

ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు

మహబూబాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సీతక్కకు భారీ బైక్‌ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మహిళలతో కలిసి డీజే పాటలకు కాలు కదిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో చిట్టెం పర్ణికా రెడ్డి లంబాడీల వేషధారణలో ఓట్లు అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆలేరు అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మహిళలు భట్టి విక్రమార్కకు మేళతాళాలు, పూలతో స్వాగతం పలికారు.

పోలింగ్‌ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?

Congress Election Campaign in Nizamabad : నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దన్‌పాల్‌ సూర్యనారాయణ 8వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్​ వైఫల్యాలను.. తొమ్మిదేళ్ల బీఆర్​ఎస్​ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాంపల్లి, కార్వాన్‌ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా అసదుద్దీన్‌ ఓవైసీ ఓట్లు అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్‌ పార్టీ ప్రజాశీర్వాద సభకు ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్‌ హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

'ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిన బీఆర్‌ఎస్‌ను ఓడించాలి'

ABOUT THE AUTHOR

...view details