Opposition Parties Fires on CM Jagan: జగన్‌కు బాబాయ్ హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల మీద లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బాబాయ్ హంతకులను కాపాడేందుకే సీఎం జగన్ విశాఖ రాజధాని అని.. సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని తెరమీదకు తెచ్చారని కొల్లు ఆరోపించారు. అందుకే డైవర్ట్ పాలిటిక్స్‌కు తెర లేపారని దుయ్యబట్టారు.
ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నారు: లిక్కర్ స్కాంలో భార్య పేరు బయటకు రాగానే సీఎం జగన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేర్చు తెరమీదకు తెచ్చారని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. నాడు రాజధానికి 30వేలు ఎకరాలు కావాలని.. ఇల్లు ఇక్కడే కట్టాను అని, ఇప్పడు రాజధాని విశాఖ అంటున్నావు అని ఇది మోసం కాదా జగన్ అని ధ్వజమెత్తారు. ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నారని అన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచగానే.. జగన్ మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతాం: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రాణాలను అడ్డు వేసైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. తమ విధానం రాష్ట్రం అభివృద్ధి చెందడం.. అన్ని ప్రాంతాలు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా క్షత్రంలో ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతామని కొల్లు రవీంద్ర అన్నారు.