ప్రచారంలో జోరు పెంచిన ప్రతిపక్షాలు - ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటామంటూ ఓట్లు అభ్యర్థన Opposition Parties Election Campaign in Telangana : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ(Telangana Congress 6 Guarantees)లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ సికింద్రాబాద్ అభ్యర్థి ఆదం సంతోశ్ కుమార్ ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ కేసముద్రం మండలంలో గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన గండ్ర సత్యనారాయణ రావుకు ప్రజలు స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Congress Candidates Door to Door Election Campaign :పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సబితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి తరఫున ఆయన భార్య మాధవి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు.
గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట
Congress Election Campaign in Telangana :భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఐలయ్యను అత్యధితక మెజారిటీతో గెలిపించాలని మోత్కుపల్లి నర్సింహులు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన సామాజిక సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఇద్దరు కర్ణాటక మంత్రులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో గడపగడపకు తిరుగుతూ మైనంపల్లి రోహిత్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
BJP Election Campaign in Telangana :భువనగిరి జిల్లా వలిగొండలో బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో.. ఈటల రాజేందర్(Etela Rajender) పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం.. మెదక్ అభ్యర్థి పంజా వినయ్‌కుమార్‌కు మద్దతుగా రామాయంపేటలో గడపగడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి విస్తృతంగా ప్రజల్లోకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ - డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ ప్రచారం
అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న విపక్ష అభ్యర్థులు - ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లకు అభ్యర్థన