Opposition Parties Election Campaign In Telangana 2023 :మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నియోజకవర్గ పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. కుటుంబ పాలనను అంతమొందించి.. అభివృద్ధి, సంక్షేమం అందించే బీజేపీకి పట్టంకట్టాలని నడ్డా కోరారు. పరకాల బీజేపీ అభ్యర్థి కాళీ ప్రసాద్‌కు మద్దతుగా ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనైమాకుల నుంచి ఊకల్ కార్నర్ వరకు రోడ్‌షో నిర్వహించిన ఈటల.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటలకు మద్దతుగా ఆయన సతీమణి జమున ఇంటింటికి వెళ్లి, ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, గులాబీ పార్టీ అభ్యర్థులిద్దరూ కేసీఆర్ మనుషులేనని ఆమె ఆరోపించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ విస్తృతంగా పర్యటించారు. నారాయణపేట జిల్లా మక్తల్ బీజేపీ అభ్యర్థి జలెందర్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, కర్ణాటకలో కాంగ్రెస్ పాలనా తీరును వివరిస్తూ.. కమలం గుర్తుకు ఓటేయాలని ఆమె కోరారు.
హరీశ్‌రావుకు పార్టీలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు : ఈటల రాజేందర్
కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్.. బాలాజీనగర్ డివిజన్‌లోని ఖైత్లాపుర్‌లో(Congress Election Campaign) ఇంటింటికి వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్, చింతకాని మండలాల్లో మధిర కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌అలీ.. భట్టి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
Seethakka Campaign In Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో ములుగు కాంగ్రెస్‌అభ్యర్థి సీతక్క ప్రచారం(Seethakka Election Campaign) నిర్వహించారు. ఆదివాసీ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రనాయక్.. కురవి మండలం నేరడ, తులస్యాతండా, లచ్చిరాం తండాలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. మరిపెడ, దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో బీజేపీ అభ్యర్థి భూక్యా సంగీత ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి బీఆర్ఎస్ నేత పూలపల్లి వెంకటేశ్.. ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఐలయ్య విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ..చొల్లేరుకు చెందిన ఆ పార్టీ కార్యకర్తలు యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేశారు.
'వరాలు ప్రకటించేయ్-ఓట్లు పట్టేసెయ్'-మరి ఓటర్ల ఏ పార్టీ మేనిఫెస్టో వైపు మొగ్గు చూపుతారో?