Opposition parties Telangana Election Campaign 2023 : ఆరు గ్యారెంటీలు, బస్సు యాత్రలతో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతుండగా.. రెండో జాబితాతో కలిపి మొత్తం 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. పకడ్బందీ చర్యలతో అధికారం ఛేజిక్కించుకునేలా కదన రంగంలోకి వెళ్తోంది. ఈనెల 29న సంగారెడ్డిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సభ నిర్వహించనున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.
Mynampally Hanumantha Rao Comments on Harish Rao : మెదక్ జిల్లాను దోచుకోవడం, వెన్నుపోటు పొడవడం మంత్రి హరీశ్‌రావుకు అలవాటైందని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో స్థానిక అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవినీతి మయమైన బీఆర్ఎస్ సర్కార్(BRS Government)కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. పాలేరు సభలో సీఎం కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
BJP vs Janasena Ticket Issue in Hyderabad : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జెండా ఎగరేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కోరుట్లలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అర్వింద్(MP Arvind).. అనంతరం బూత్‌స్థాయి ఇంఛార్జుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గౌలిగూడలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేసు రత్నం గెలిచినా.. ఓడినా బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గం సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు. జనసేనతో పొత్తు విషయంల ఇంకా స్పష్టత రాలేదని.. అధిష్టానం నిర్ణయించాక స్పష్టత వచ్చి.. సీట్లు విషయం తెలుస్తుందని బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.