Congress Ministers Vs Akbaruddin Owaisi : విద్యుత్ రంగం శ్వేతపత్రంపై చర్చలో పాల్గొన్న మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ 2014కు ముందు ఉన్న చీకటి రోజులను గుర్తు చేసుకావాలని అన్నారు. అప్పట్లో పరిస్థితులు దారుణంగా ఉండేవని, ఇవాళ పరిస్థితులు పూర్తిగా మారి కరెంట్ కోతలు లేవని తెలిపారు. ప్రభుత్వశాఖల నుంచి బకాయిల వల్ల డిస్కంలకు తీవ్ర నష్టాలు జరిగాయన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ఇస్తామని హామీ అమలుపై స్పష్టత ఇవ్వాలని అక్బర్ కోరారు. కొత్త విద్యుత్ సంస్కరణల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని, మోటార్లకు మీటర్లు పెడతారా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఛాలెంజ్ - విద్యుత్‌కు సంబంధించి ఆ 3 అంశాలపై న్యాయ విచారణకు సీఎం ఆదేశం
పిల్లలు చాలా నేర్చుకోవాల్సి ఉందంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సభలో వేడి పెంచాయి. దీంతో అక్బర్‌కు సీఎం, సహామంత్రులకు మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకొంది. ప్రభుత్వాన్ని తాము అడుగుతున్నామన్న ఓవైసీ, మజ్లిస్ ఉండకూడదని కాంగ్రెస్ చూస్తోందని వ్యాఖ్యానించారు. అక్బర్ వ్యాఖ్యలతో విభేదించిన శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు, కొత్త సభ్యుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి - విద్యుత్ రంగంపై వాడివే‘ఢీ’గా చర్చ
Akbaruddin Owaisi vs Telangana Government : ఈ దశలో జోక్యం చేసుకున్న సభానాయకుడు రేవంత్ రెడ్డి సీనియారిటీని గుర్తించి అక్బర్‌ను ప్రొటెం స్పీకర్ చేశామని, సభలో అందరికీ సమాన హక్కులు, గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ కించ పరిచేలా మాట్లాడడం తగదన్న సీఎం, పదేళ్లు కలిసి రాష్ట్రాన్ని నడిపించి, ఇప్పుడు పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని ఆక్షేపించారు. మజ్లిస్‌ను కేవలం ముస్లింలకు ప్రతినిధిగా చూడడంలేదని, అందరి ప్రతినిధిగా చూస్తున్నామన్న రేవంత్ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు - జగదీశ్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం
హరీష్ రావు, కేసీఆర్, అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల నుంచి భారీగా బకాయిలు ఉన్నాయని వారి వల్లే డిస్కంలు నష్టపోయాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కోతలపై ధర్నాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, మైనార్టీ యువతి సహా తొమ్మిది మంది మరణించిన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదం గురించి అక్బర్ కనీసం ప్రస్తావించలేదని అన్నారు. మజ్లిస్ మద్దతుతో కేసీఆర్ సర్కార్ దుర్మార్గాలు చేసిందని, తాము బాధ్యతతో శ్వేతపత్రం పెట్టామని సీఎం వివరించారు.
Opposition Leaders Vs Congress Ministers : అక్బర్ వ్యాఖ్యలతో విభేదించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభా నాయకున్ని గురించి కూడా అడ్డగోలుగా మాట్లాడడం సబబు కాదన్నారు. తాము ఎప్పుడూ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర పోషిస్తామన్న ఓవైసీ, ముస్లిం మైనార్టీలు, పేదలకోసం తాము పనిచేస్తామని చెప్పారు. బీజేపీకు బీ టీమ్అని తనను అన్నారని చనిపోనైనా చనిపోతాం కానీ, బాబ్రీ మసీదు కూల్చిన వారు, ముస్లింల రక్తంతో హోలీ ఆడినవారితో కలిసి పని చేయబోమని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడకు పోయారో, ఇప్పుడే చర్చిద్దామంటూ సవాల్ చేశారు.
'రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం'- ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు