తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఏమన్నారో తెలుసా? - ts news

Opposition Leaders on KCR: ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీ చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై విపక్ష నేతలు భిన్నంగా స్పందించారు. మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ఆరోపించగా.. యువత ఆకాంక్షల మేరకు ప్రకటన ఉండాలని కాంగ్రెస్‌ నేతలు సూచించారు. రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఏమన్నారో తెలుసా?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఏమన్నారో తెలుసా?

By

Published : Mar 9, 2022, 3:52 AM IST

Updated : Mar 9, 2022, 5:23 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఏమన్నారో తెలుసా?

Opposition Leaders on KCR: నిరుద్యోగులకు తీపికబురు చెప్పబోతున్నట్లు సీఎం కేసీఆర్‌ వనపర్తి సభలో వెల్లడించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువత టీవీలు చూడాలన్నారు. దీనిపై విపక్ష నేతలు స్పందించారు. ముఖ్యమంత్రి మరోసారి నిరుద్యోగులను మోసం చేయటానికి ప్రయత్నిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఒకవేళ నోటిఫికేషన్లు వేసినా వాటిపై కేసులు వేయించి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో యువత ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి కోచింగ్‌లకు వస్తారని.. మళ్లీ మోసపోతారని వ్యాఖ్యానించారు.

మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు..

5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ చూసి కేసీఆర్‌కు మతి భ్రమించింది. భాజపా గెలుపు నుంచి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారు. భాజపా ఉన్నంతకాలం పచ్చ జెండాలకు అవకాశం ఇవ్వం. రజాకార్ల పార్టీతో కలిసి.. భాజపాను మతతత్వ పార్టీ అంటారా?. రేపు అందరూ టీవీ చూడాలని కేసీఆర్ అంటున్నారు. రేపు కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకోవడమే. నిరుద్యోగులను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేయొద్దు. 25 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి. తొలగించిన విద్యా వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి.

-బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

సంతోషం కలిగించింది..

సీఎం కేసీఆర్‌ ప్రకటన తనకు సంతోషం కలిగించిందని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే స్వాగతిస్తామని వెల్లడించారు. తాము ఆశించినట్లు ప్రకటన చేసినట్లయితే కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ ద్వారా అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు 25 లక్షల వరకు ఉన్నారని...వారందరికీ న్యాయం జరిగేలా ప్రకటన ఉండాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మూడు సంవత్సరాలుగా నిరుద్యోగ భృతిపై మభ్య పెట్టారన్న భట్టి.. ఆ విషయంపైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పాలాభిషేకం చేస్తా..

సీఎం కేసీఆర్‌ ప్రకటనపై నేనూ ఆసక్తిగా ఉన్నా. నిరుద్యోగభృతి అమలు గురించి సీఎం ప్రకటిస్తారని ఆశిస్తున్నా. రూ.3116 నిరుద్యోగ భృతిని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. నిరుద్యోగులకు 37 నెలల బకాయిలు సీఎం ఇస్తారని ఆశిస్తున్నా. సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయగానే భువనగిరికి వెళ్తా. సీఎం కేసీఆర్‌కు భువనగిరిలో పాలాభిషేకం చేస్తా. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగభృతి కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 1.90 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 1.90 లక్షల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నా.

-కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి ఎంపీ

నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి..

నిరుద్యోగులను రేపు ఉదయం టీవీలు చూడమని కేసీఆర్‌ అన్నారు. 3లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తారని ఆశిస్తున్నా. 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి.

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలి..

అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని తెజస అధ్యక్షుడు కోందడరాం డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి యువజన విధానాన్ని ప్రకటించాలన్నారు.

ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలి. ఖాళీలు ఏర్పడగానే భర్తీ చేసేలా చట్టం తీసుకురావాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి యువజన విధానాన్ని ప్రకటించాలి. -కోదండరాం, తెజస అధ్యక్షుడు

ఇదీ చదవండి:

Last Updated : Mar 9, 2022, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details