రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. తెదేపా నేతలను హత్య చేయించి ఏపీ సీఎం జగన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని... ప్రొద్దుటూరు, గురజాల ఘటనలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
కత్తిని నమ్ముకున్న వాడు దానికే బలైపోతాడు: నారా లోకేశ్ - తెదేపా నారా లోకేశ్ తాజా వార్తలు
ఏపీ గుంటూరు జిల్లా పల్నాడులో తెదేపా నేత పురంశెట్టి అంకులు హత్యపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైకాపా రౌడీలు ఈ దారుణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని నిలదీశారు.
ఏపీ గుంటూరు జిల్లా పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులుని అత్యంత కిరాతకంగా గొంతు కోసి వైకాపా రౌడీలు హతమార్చారు. గ్రామ సర్పంచ్‌గా 15 ఏళ్ల పాటు పనిచేసిన వ్యక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ గూండాలు హత్య చేయటం దారుణం. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు ఉన్నాయా?. కత్తిని నమ్ముకున్న వాడు అదే కత్తికి బలైపోతాడు అనే సత్యాన్ని జగన్ రెడ్డి త్వరగా గ్రహిస్తే మంచిది- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి:పల్నాడులో తెదేపా నేత దారుణ హత్య