బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతలు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫారసుల మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనలను సవరించింది. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్‌తో పాటు బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ ప్రవేశపరీక్ష రాయవచ్చు. 50శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ఒకే ప్రవేశపరీక్ష...
ఇతర కోర్సుల్లాగానే ఇంజినీరింగ్ పట్టభద్రుల ఉత్తీర్ణతా మార్కుల శాతాన్ని కూడా 50శాతానికి తగ్గించారు. బీఈడీ అన్ని మెథడాలజీల కోర్సుల కోసం ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల శాతం, ఆయా మెథడాలజీలకు అర్హతా సబ్జెక్టులను కూడా ఖరారు చేశారు. గణితానికి 25శాతం, ఫిజికల్ సైన్సెస్, బయాలజీకి 30శాతం సీట్లు ఉంటాయి. ఫిజికల్ సైన్సెస్, బయాలజీలో కనీసం పదిశాతం చొప్పున గరిష్టంగా 20శాతానికి మించకుండా సీట్లు ఉంటాయి.