తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2020, 10:08 AM IST

ETV Bharat / state

ఆపద్బంధు వ్యవస్థ.. రోజూ 60 వేల కాలర్స్‌కు సమాధానం

ఆపద సమయంలో బాధితులకు వేగవంతమైన సేవలు అందించడంలో డయల్‌ 100 సర్వీసు విజయవంతమవుతోంది. శనివారంతో ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది. చిన్నచిన్న సేవల నుంచి అత్యవసర ఆరోగ్య పరిస్థితుల వరకు ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకొచ్చేది డయల్​ 100. రోజూ సగటున 60 వేల కాలర్స్‌కు సమాధానం ఇస్తూ విజయవంతంగా నడుపుతున్నారు.

Opportunity System the answer to 60 thousand calls daily in dial 100
ఆపద్బంధు వ్యవస్థ.. రోజూ 60 వేల కాలర్స్‌కు సమాధానం

‘డయల్‌ 100’ ప్రమాదంలో చిక్కుకున్నవారి పాలిట ఆపద్బంధువుగా పేరుంది. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న ‘డయల్‌ 100’ శనివారానికి ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రోజుకు సగటున 60 వేలకుపైగా ఫోన్‌కాలర్స్‌కు అవసరమైన సేవలందిస్తోంది.

16 కోట్ల మందికి సమాధానాలు..

రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా సరే ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే సమీపంలోని పోలీసుల్ని వీలైనంత తొందరగా అక్కడికి పంపించడమే కాకుండా బాధితులకు సాయం అందేవరకు పర్యవేక్షించే బాధ్యతను భుజానికెత్తుకుంది. రాష్ట్రంలోని అన్ని ఠాణాలతోపాటు 108 ఆంబులెన్స్‌, గస్తీ వాహనాలనూ అనుసంధానం చేసుకొని సేవలందిస్తోంది. గత ఏడేళ్లలో సుమారు 16 కోట్ల మందికి సమాధానాలు అందించిన ఈ వ్యవస్థ ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ బృహత్తర పాత్ర పోషిస్తోంది.

‘డయల్‌ 100’ వ్యవస్థ స్వరూపం..

  • ప్రారంభం :2013, ఏప్రిల్‌ 11
  • ప్రధాన కేంద్రం : కొంపల్లి (జీవీకే ఈఎంఆర్‌ఐ క్యాంపస్‌)
  • కాల్‌ టేకర్స్‌ :20 మంది
  • కాల్‌ డిస్పాచర్స్‌ : 10 మంది
  • అనుసంధానమైన పోలీసు కమిషనరేట్లు :9
  • అనుసుంధానమైన కంట్రోల్‌రూమ్‌లు : 20
  • అనుసంధానమైన ఠాణాలు : 727
  • అనుసంధానమైన గస్తీ వాహనాలు : 1,579
  • ప్రస్తుత సగటు స్పందన సమయం :3.5-3.75 నిమిషాలు
  • కాలర్‌ నుంచి సమాచారం రాబట్టే సమయం:100 సెకన్లు
  • సేవలపై వినియోగదారుల సంతృప్తి శాతం :98.5
  • పొందిన పురస్కారాలు :స్కోచ్‌ సిల్వర్‌, ఫిక్కీ స్పెషల్‌ జ్యూరీ

ప్రధాన ఘట్టాలు...

  1. 2016 మే 19 :జీహెచ్‌ఎంసీ, తెలంగాణ విద్యుత్తు, వాటర్‌బోర్డుల సేవలతోపాటు జాతీయ అత్యవసర స్పందన సేవల విభాగం(112)తోనూ అనుసంధానం.
  2. 2017 నవంబరు : కాల్‌సెంటర్‌కు వచ్చే అనవసర కాల్స్‌ను నియంత్రించే అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డి కార్యాచరణ.
  3. 2018 ఫిబ్రవరి : కాల్‌సెంటర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ‘112’ అత్యవసర కాల్స్‌ను డయల్‌ 100 వ్యవస్థ నుంచి వేరు చేయడంపై ప్రణాళిక. రెండింటికి కలిపి ఉమ్మడి డిస్పాచ్‌ కేంద్రం ఏర్పాటు యోచన.
  4. ఏప్రిల్‌ :రాష్ట్రవ్యాప్తంగా బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలతో అనుసంధానం.
  5. ఆగస్టు : ఉమ్మడి ఏపీ డయల్‌ 100 వ్యవస్థ నుంచి తెలంగాణకు ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు.
  6. 2019 డిసెంబరు : దిశ ఘటన నేపథ్యంలో ప్రయాణంలో ఉన్న ఒంటరి మహిళలను ఇళ్లకు చేర్చే ప్రణాళిక.
  7. 2020 ఫిబ్రవరి : డయల్‌ 112 వ్యవస్థలో ఐవీఆర్‌ఎస్‌ విధానం ఏర్పాటు. రోజూ 6.9 లక్షల కాల్స్‌కు సమాధానం.
  8. 2020 మార్చి :డయల్‌ 100 వ్యవస్థలో ఐవీఆర్‌ఎస్‌ విధానం అమలు. కాలర్‌ లొకేషన్‌ ఆధారంగా సమీప ఠాణాల్ని అప్రమత్తం చేసే విధానం ఆరంభం.

ఇదీ చూడండి :ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details