తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధార్‌కార్డు లేని ఎన్నారైలకూ ధరణిలో అవకాశం - ధరణి ఎన్​ఆర్​ఐ వార్తలు

ఆధార్‌కార్డు లేని ప్రవాస భారతీయులు ధరణిలో భూలావాదేవీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని కల్పించడాన్ని తెరాస ఎన్​ఆర్​ఐ విభాగం హర్షం వ్యక్తం చేసింది.

ఆధార్‌కార్డు లేని ఎన్నారైలకూ ధరణిలో అవకాశం
ఆధార్‌కార్డు లేని ఎన్నారైలకూ ధరణిలో అవకాశం

By

Published : Nov 8, 2020, 5:09 AM IST

ఆధార్‌కార్డు లేని ప్రవాస భారతీయులు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు, పాస్‌పోర్టు ద్వారా ధరణిలో భూలావాదేవీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో భూలావాదేవీల కోసం ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు.

పలువురి ప్రవాసులకి ఆధార్ లేని విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. వారు ధరణిలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఓసీఐ కార్డు, పాస్‌పోర్టులకు అనుమతిచ్చారు. ఈ అవకాశాన్ని కల్పించడాన్ని తెరాస ఎన్​ఆర్​ఐ విభాగం హర్షం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ను ఎన్​ఆర్​ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్​ బిగాల కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details