Land Occupied in Srikakulam : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణమైన ఘటన జరిగింది. భూవివాదంలో కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రిలపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. తల్లి కుమార్తెలపై ట్రాక్టర్‌తో మట్టి పోసి పూడ్చేందుకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు వారిని మట్టి నుంచి బయటకు తీశారు.
భూకబ్జాదారుల దారుణం.. తల్లీకూతుళ్లపై హత్యాయత్నం - land dispute in srikakulam
Land Occupied in Srikakulam: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భూకబ్జాదారులు దారుణానికి పాల్పడ్డారు. భూవివాదంతో తల్లి, కుమార్తెలపై మట్టిపోసి పూడ్చేందుకు యత్నించారు. ఇది చూసి స్థానికులు వారిని రక్షించారు. ప్రత్యర్థులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు.
Land Occupied
తమ స్థలాన్ని కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. ప్రత్యర్థులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: