సముద్రానికి ఆవల... ఎక్కడో చిన్న దీవిలో... ఓ పక్క కరోనా.. మరో పక్క ఆకలి కేకలు. కరోనా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న సమయం. దేశాలు సరిహద్దులు మూసేసి నివారణ చర్యలు చేపట్టిన తరుణం. పొట్టకూటి కోసమో... చదువు కోసమో.. దేశం కాని దేశం వచ్చి లాక్డౌన్ వల్ల వందలాది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం కదిలింది.
మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సముద్రసేతు ప్రారంభించింది. నావికాదళం రెండు యుద్ధ నౌకలతో వారందరినీ దేశానికి తరలించేందుకు సన్నద్ధం అయ్యింది. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వ సాగర జలాలపై ముందుకు కదిలింది.