విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ‘సముద్ర సేతు’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్ జలాశ్వ, ఐఎన్‌ఎస్ మఘర్ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు వెల్లడించాయి.
సముద్రసేతు... యుద్ధనౌకల్లో మాతృదేశానికి ! - ఆఫరేషన్ సముద్రసేతు వార్తలు
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లో దేశానికి తీసుకువస్తున్నట్లు నావికాదళ వర్గాలు తెలిపాయి. సముద్రసేతు పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తరలిస్తున్నారు. ఐఎన్‌ఎస్ జలాశ్వలో 698 మందిని స్వదేశానికి తరలిస్తున్నట్లు నౌకదళ అధికారులు తెలిపారు.
సముద్రసేతు... యుద్ధనౌకల్లో మాతృదేశానికి !
తొలివిడతగా గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తూ వెయ్యి మందిని దేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నాయి. ఐఎన్‌ఎస్ జలాశ్వలో 698 భారతీయులను స్వదేశానికి తరలించారు. ఐఎన్‌ఎస్ జలాశ్వ నౌక కేరళలోని కొచ్చికి రానున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్