తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2020, 7:11 AM IST

ETV Bharat / state

ఏడాది తరువాత తప్పిపోయిన అమ్మాయిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు

రాచకొండ కమిషనరేట్​ పరిధిలో తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకే ఆపరేషన్​ ముస్కాన్- 6 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్​ జిల్లాలో ఏడాది క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన ఓ బాలికను ముస్కాన్​ ఆపరేషన్​ ద్వారా గుర్తించారు.

operation muskan-6 in
తప్పిపోయినవారిని అమ్మఒడికి చేర్చుతున్న ఆపరేషన్​ ముస్కాన్​-6

తప్పిపోయిన పిల్లలను తల్లి ఒడికి చేర్చడంలో ఆపరేషన్​ ముస్కాన్ కీలకపాత్ర పోషిస్తోందని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. ​ ఆపరేషన్​ ముస్కాన్​-6లో భాగంగా ఏడాది క్రితం తల్లిదండ్రులకు దూరమైన ఓ బాలికను తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని గుడ్​షెప్పర్​ ఆశ్రమంలో ఉన్న బాలికను ఆపరేషన్​ ముస్కాన్​-6 సహాయంతో తల్లిదండ్రులకు అప్పగించారు. ఆశ్రమంలో నాలుగోతరగతి చదువుతున్న లక్ష్మి 2019లో సంగారెడ్డి జిల్లా బలనందనం రెస్క్యూ హోమ్ నుంచి తప్పిపోయిందని అక్కడి వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఈ విషయాన్ని ముస్కాన్ యాప్​లో అప్లోడ్ చెయ్యగా.. రాచకొండ పోలీసులు ఆపరేషన్​ ముస్కాన్​ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సమాచారాన్ని సేకరించిన ముస్కాన్-6 కానిస్టేబుల్ మౌనికను ప్రశంసిస్తూ సీపీ మహేశ్​ భగవత్​ రివార్డ్​ను అందజేశారు.

ఇదీ చూడండి:నెట్టింట్లో ఇంటర్ పాఠాలు.. త్వరలో యూట్యూబ్‌ ఛానల్‌

ABOUT THE AUTHOR

...view details