తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్​ తీసుకోండి' - Opening of Corona Vaccine Center under Ram Gopal Pet Division

ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కొవిడ్​ వ్యాక్సిన్​ని వేసుకోవాలని రామ్ గోపాల్ పేట్ నూతన కార్పొరేటర్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నావారికి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

Opening of Corona Vaccine Center under Ram Gopal Pet Division
'ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్​ తీసుకోండి'

By

Published : Jan 20, 2021, 5:40 PM IST

కరోనా వ్యాక్సిన్ విషయంలో అనుమానాలు, అపోహలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని రామ్ గోపాల్ పేట్ నూతన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు. హైదరాబాద్ సికింద్రబాద్​​లోని రామ్​గోపాల్ పేట్ డివిజన్ పరిధిలో నల్లగుట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో కరోనా వాక్సిన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

మొదటి టీకాను ఆశా వర్కర్లు తీసుకున్నారు. దాదాపు ఇరవై మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని... వారికి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఆమె తెలిపారు. టీకా రావడం వల్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోయాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంఛార్జీ డా. శ్రీమాన్ నారాయణ, స్టాఫ్ నర్స్ , ఆశా వర్కర్లు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి'

ABOUT THE AUTHOR

...view details