ఓపెన్ స్కూల్ (Open School) పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం.. టాస్ (Toss)లో పది, ఇంటర్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో ఓపెన్ స్కూల్ పదో తరగతిలో 63, 581 మంది, ఇంటర్లో 47,392 మంది పాసయ్యారు. కరోనా తీవ్రత కారణంగా పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులను చేసే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
కమిటీ సిఫార్సుల మేరకు జీవో జారీ చేసింది. విద్యార్థులందరినీ 35 మార్కులతో ఉత్తీర్ణుల్ని చేయాలని నిర్ణయించింది. వివిధ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు ఉన్నట్లుగా పరిగణించాలని పేర్కొంది. మార్కులతో సంతృప్తి చెందని వారు టాస్ పరీక్ష నిర్వహించినప్పుడు... ఇంప్రూవ్మెంట్ నిబంధనల మేరకు రాసుకోవచ్చని తెలిపింది. ఫలితాలను ప్రకటించాలని టాస్ డైరెక్టర్‌ను విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు...