తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరుచుకున్న జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు తూము - జీడిమెట్ల ఫాక్స్​ సాగర్​ చెరువు

జీడిమెట్ల ఫాక్స్​ సాగర్​ చెరువు తూము రెండ్రోజుల పాటు శ్రమించిన అనంతరం తెరుచుకుంది. సాగర్​, శ్రీశైలం ప్రాజెక్టు నిపుణులు తీవ్రంగా శ్రమించి తూమును తెరిచారు.

Open Jeedimetla Fox Sagar Pond Sluice in hyderabad
తెరుచుకున్న జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు తూము

By

Published : Oct 21, 2020, 5:04 PM IST

హైదరాబాద్‌ జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు తూము ఎట్టకేలకు తెరుచుకుంది. రెండ్రోజుల పాటు శ్రమించిన సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిపుణులు ఎట్టకేలకు తూము తెరవగలిగారు. ప్రస్తుతం కొంత మోతాదులో నీరు బయటకు వెళ్తోంది.

పూర్తిస్థాయిలో నీరు బయటకు వెళ్లేందుకు కొంత సమయం పట్టొచ్చని అధికారులు వెల్లడించారు. అంతకుముందు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు పూర్తిస్థాయిలో నిండటం వల్ల తూము తెరిచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు.

ఇవీ చూడండి: హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం

ABOUT THE AUTHOR

...view details