హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని జూలై నెలాఖరులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. అయితే ప్రారంభించిన తర్వాత ప్రతి శనివారం, ఆదివారాల్లో బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఆ రెండు రోజులు కేవలం పర్యటకులను మాత్రమే కాలినడకన కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతించనున్నట్లు తెలిపారు. వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్కింగ్ చేసుకుని బ్రిడ్జిపైకి కాలినడకన మాత్రమే వెళ్లాలని సూచించారు.
'వారాంతాల్లో పర్యటకులకు మాత్రమే అనుమతి' - tourists allowed into durgam cheruvu cable bridge
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేశామని... అందులో భాగంగా ప్రతి శని, ఆదివారాల్లో వాహనాలను బ్రిడ్డిపైకి అనుమతించబోమని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. బ్రిడ్జిపైన విహరించే పర్యటకులు.. నగర అందాలను తిలకిస్తూ మధురానుభూతిని పొందేందుకు ప్రశాంత వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
వారాంతాల్లో పర్యటకులకు మాత్రమే అనుమతి
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరిగిందని చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ వెల్లడించారు. పర్యటకులు కేబుల్ బ్రిడ్జిపైన విహరిస్తూ.... నగర అందాలను తిలకించి మధురానుభూతిని పొందేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో వాహనాలు అనుమతించడం లేదని చీఫ్ ఇంజనీర్ వివరించారు.
ఇదీ చూడండి:వ్యాప్తికి ముందే కరోనా జాడ కనిపెట్టొచ్చిలా