Online Trading Frauds in Hyderabad : ఇటీవల ఓ బాధితుడికి మీరు ట్రేడింగ్ చేస్తున్నారా అంటూ ఫోన్ వచ్చింది. అవునని చెప్పడంతో తాము ట్రేడింగ్ టిప్స్ ఇస్తామని.. షేర్లు కొనుగోలులో సహాయం చేస్తామని చెప్పి పలు మార్లు అతని టిప్స్ ఇచ్చారు. అనంతరం మంచి లాభాలు వచ్చేలా ట్రేడింగ్ చేస్తామని నమ్మించి బాధితుడి నుంచి డీమ్యాట్ ఖాతా వివారాలు తీసుకున్నారు. తర్వాత డీమ్యాట్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న బాధితుడి ఖాతాలో కాకుండా తాము చెప్పిన ఖాతాలోకి డబ్బులు పంపాలని అతనికి చెప్పారు. దీంతో బాధితుడు రూ.2లక్షల 60వేలు బదిలీ చేశాడు. అనంతరం స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకుఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, ఏపీలోని అన్నమయ్యలో జిల్లా పీలేరులోని ఓ కాల్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు.
Online Trading Tips Frauds in Hyderabad :ప్రధాన నిందితుడు సాయి శరణ్ కుమార్ రెడ్డి సహా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు అన్నమయ్య జిల్లాకు చెందిన సాయి శరణ్ కుమర్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. షేర్ మార్కెట్ పై ఉన్న ఆశక్తితో మొదట్లో పలువురికి సలహాలు ఇచ్చాడు. అనంతరం పీలేరులో ఎలాంటి అనుమతులు లేకుండాట్రేడింగ్ సలహాలు ఇచ్చే ఓ కంపనీని తెరిచాడు. తన స్నేహితులు, సహచరులైన వారిని కంపనీలో పలు అధికారులుగా నియమించాడు.