ఎనిమిది వేలమంది అర్చకులకు వేతనాలు ఇస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11 దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆ ఆలయాలకు సంబంధించి సేవలు, గదులు ఆన్‌లైన్, యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 21490 చ.కి.మీ. విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉందని ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.
11 దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - 11 దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు
రాష్ట్రంలో 11 దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పద్దులపై చర్చలో పాల్గొన్నారు. 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇంద్రకరణ్ రెడ్డి