ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల 90 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీ నాగ్‌పూర్‌కు చెందిన అన్సారీగా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించడానికి వెబ్ అప్లికేషన్స్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముగ్గురు అదుపులోకి..
పాతబస్తీకి చెందిన ఉదయ్ సుందర్ రావు, సర్వేశ్, బాలకృష్ణలను ఏజెంట్లుగా నియమించుకొని కొన్ని రోజులుగా బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నడని వెల్లడించారు. వీరి ముగ్గురిని ఉప్పుగూడ ప్రాంతంలో పట్టుకున్న దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రధాన బుకిీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరు అరెస్ట్