మహిళలను వేధించే పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు కొత్తపంథాను ఎంచుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆన్‌లైన్‌లో అవగాహన కల్పిస్తూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నుంచి డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పర్యవేక్షించారు.
పోకిరీల మార్పు కోసం ఆన్‌లైన్ కౌన్సిలింగ్ - హైదరాబాద్ సమాచారం
మహిళలను వేధించే పోకిరీలకు వినూత్న పద్ధతిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి ప్రవర్తన మారేందుకు ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించారు హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం కార్యాలయం నుంచి అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
పోకీరీల మార్పు కోసం ఆన్‌లైన్ కౌన్సిలింగ్
ఆన్‌లైన్ ద్వారా దాదాపు 150 మంది పోకిరీలకు నిపుణులైన కౌన్సిలర్లు అవగాహన కల్పించారు. దీని వల్ల తాము చేసిన తప్పు ఎంటో తెలిసి వచ్చిందని వారు షీ టీమ్ పోలీసులకు తెలిపారు. జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయమని అన్నారు. కౌన్సిలింగ్ విధానానికి సంబంధించిన బుక్‌లెట్‌ను అదనపు డీజీ స్వాతిలక్రా విడుదల చేశారు.