పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం ద్వారా... ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. 2019-20 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు... ఇది వరకే ప్రవేశాలు పొందిన వారికి... మే, జూన్ (2020) నెలల్లో వర్శిటీ ఆవరణలో తరగతులు నిర్వహించాల్సి ఉంది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ తరగతులు - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వార్తలు
2019-2020 విద్యా సంవత్సరానికి దూర విద్యా కేంద్రం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలిపింది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ తరగతులు
కొవిడ్ కారణంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు దూర విద్యా కేంద్ర సంచాలకులు సి.మురళీ కృష్ణ తెలిపారు. విద్యార్థులు www.teluguuniversity.ac.in వెబ్సైట్ను సందర్శించి వివరాలు పొందుపరచవచ్చని తెలిపారు. విద్యార్థులందరూ ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:నవంబర్ 1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్
TAGGED:
online classes news