తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్​లైన్​ శిక్షణ' - tsmcet

రాష్ట్రవ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా ఆన్​లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. లాక్​డౌన్ ప్రభావం విద్యార్థులపై పడకుండా ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది.

online classes for govt intermediate college students of telangana
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్​లైన్​ శిక్షణ

By

Published : Apr 15, 2020, 2:57 AM IST

ఎంసెట్, జేఈఈ, నీట్​కు సిద్ధమవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులపై లాక్​డౌన్ ప్రభావం పడకుండా ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నాలు చేపట్టింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా ఆన్​లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ప్రతీ ఏడాది వేసవిలో ఎంసెట్, జేఈఈ, నీట్ కోసం స్వల్ప కాలిక శిక్షణ ఇస్తున్నారు. అయితే కరోనా ప్రభావంతో ఈ ఏడాది కోచింగ్ నిర్వహించలేక పోవడం వల్ల ప్రత్యామ్నాయంగా ఆన్​లైన్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

వీడియో పాఠాల లింక్​లను జిల్లా ఇంటర్ అధికారులు, ప్రిన్సిపల్స్​, లెక్చరర్లకు పంపించినట్లు తెలిపారు. వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి వీడియో పాఠాల లింకులను విద్యార్థులకు పంపించాలని ప్రిన్సిపల్స్​ను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశించారు. మానసిక నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు.

ఈ నెల 20 నుంచి ఆన్​లైన్​లో ప్రతీ శిక్షణతో పాటు రోజు, వారం పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:వేలంలో పాల్గొంటే అంతు చూస్తా: బీబీ పాటిల్ మనువని బెదిరింపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details