హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా మార్చి 25 నుంచి నిలిచిపోయిన విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలో సూచించేందుకు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం ఇచ్చిన సూచనలపై వీసీ అప్పారావు గురువారం యూనివర్సిటీలోని వివిధ విభాగాల అధిపతులు, డీన్లతో సమావేశమై చర్చించారు.
టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు ఈ నెల 20 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. పేద విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వెయ్యి రూపాయల డిజిటల్ యాక్సెస్ గ్రాటు ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. గతంలో హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే నిధులని ఇంటర్నెట్ సదుపాయం కోసం ఇవ్వాలన్న టాస్క్ ఫోర్స్ సిఫార్సును ఆమోదించింది.