Online Betting on Telangana Assembly Elections :రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారంతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు ఏ పార్టీ గెలుస్తుందోనని ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఫలానా పార్టీ గెలుస్తుందంటూ వేల నుంచి లక్షల వరకూ బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ ప్రాంతాలలో సైతం పోస్టర్లను అంటిస్తూ అమాయకులకు గాళం వేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 :ఇప్పటి వరకు క్రికెట్, ఇతరత్రా పోటీలపై బెట్టింగులు నిర్వహించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కన్నేశాయి. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఏ పార్టీ, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంచనాలపై వేర్వేరు బెట్టింగ్ సంస్థలు పందేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు ప్రచారకర్తలుగా ఆయా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లకు విస్తృత ప్రచారం కల్పిస్తుండటం, వెబ్‌సైట్లు, బస్టాపులు, ఆటోలపై వారి ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు.
బెట్టింగ్‌లో గెలిస్తే రెట్టింపు డబ్బులు :బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటాయి.. అంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థలు ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని.. పందెంలో గెలిచిన వారు అంతకంత డబ్బు సంపాదించుకోవచ్చని ఊరిస్తున్నాయి.
అధికార పక్షానికి దీటుగా విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారాలు