ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, ఒంగోలు డెయిరీ పాలు ఇక మీదట ఉండవు. పాల సేకరణకు ముగింపు పలికారు. గుజరాత్ పాల ఉత్పత్తి దారుల సంఘానికి జిల్లాలో పాల సేకరణకు అనుమతులివ్వటం వల్ల ఒంగోలు డెయిరీ పరిస్థితి కొంత ఇరకాటంలో పడింది. తాజాగా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒంగోలు డెయిరీని అమూల్ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. డెయిరీ ఒకప్పుడు లక్షల లీటర్లు పాలు సేకరించేదని, కానీ ఇప్పుడు 10వేల లీటర్ల పాలు కూడా సేకరించే పరిస్థితి లేదని, అప్పులు , నష్టాలు తప్పా డెయిరీ పరిస్థితి ఏమీ బాగలేదని ఏపీ డెయిరీ ఎండీ, ఒంగోలు డెయిరీ ఛైర్మన్ అహ్మద్ బాబు తెలిపారు. ఇలాగే కొనసాగిస్తే ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల నష్టాలతో నడిపే కన్నా మూసివేయడమే మేలని అహ్మద్ బాబు పేర్కొన్నారు.
పాడి రైతులకు సరైన ధర లభించడం లేదని, అందువల్ల మహిళా సంఘాలను బలోపేతం చేసి, వారిని 1964 సహకార చట్టం ప్రకారం పాడి సొసైటీలుగా ఏర్పాటు చేసి, వారి ద్వారా పాలు సేకరణ చేపట్టి, అమూల్ సంస్థకు సరఫరాచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ అహ్మద్ బాబు ప్రకటించారు. ఈ తీర్మానంతో జిల్లాలో ఉన్న పాడి ఉత్పత్తుల సంఘాలన్నీ మూతపడినట్లే అని భావిస్తున్నారు. నాలుగు శీతలకీరణ కేంద్రాలను అమూల్ సంస్థ వినియోగించుకుంటుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అధికారుల పర్యవేక్షణలో పాలు సేకరణ చేస్తున్నారు. అమూల్ సంస్థ రోజుకు దాదాపు 11వేల లీటర్లువరకూ పాలు సేకరిస్తుంది.
సభ్యుల అభ్యంతరాలు: