తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccine centers: చంపాపేటలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ - సూపర్ స్ప్రేడర్స్ కోసం చంపాపేటలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట మోడల్ మార్కెట్ వద్ద సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో టీకాల పంపిణీ సజావుగానే సాగుతోంది.

Ongoing vaccination process in Champapeta
చంపాపేటలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

By

Published : Jun 2, 2021, 3:17 PM IST

Updated : Jun 2, 2021, 6:10 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట మోడల్ మార్కెట్ వద్ద సూపర్ స్ప్రెడర్స్ కోసం వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు ఈ కేంద్రంలో టీకాలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చంపాపేట డివిజన్ భాజపా కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. కేవలం కార్మికులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని మధుసూదన్ వైద్యాధికారులను కోరారు. మూడు రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Jun 2, 2021, 6:10 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details