బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలోని డీడీ కాలనీలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అంబర్పేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఇంఛార్జీ బండారు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదు బ్రహ్మాండంగా జరుగుతుందని వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల మహిళలు కూడా పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు. పార్టీ అధినాయకత్వం తమకు ఇచ్చిన టార్గెట్ కంటే, ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న తెరాస సభ్యత్వ నమోదు - membership
బాగ్ అంబర్పేట డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు...