మహానగరంతో పాటు అనేక జిల్లాల నుంచి రోజూ వెయ్యిమందికి పైగా అనుమానితులు/ పాజిటివ్ వచ్చినవారు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
రాజధానిలో దాదాపు 25 ప్రైవేటు ఆసుపత్రుల్లో 2500 పడకలు ఉన్నాయి. అయినా అవి దొరకడం గగనం. కొన్ని ఆసుపత్రులు దోపిడీకి గురి చేస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే ఆసరాగా మారాయి. వీటిలోనూ కొన్ని దవాఖానాల్లో తగిన వైద్యం అందడంలేదని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. అయితే వైరస్ విజృంభిస్తున్న వేళ ఇవీ లేకపోయి ఉంటే అనేకమంది ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఛాతీ, ఆయుర్వేద, కింగ్‌కోఠి, నేచర్‌క్యూర్, సరోజినీదేవి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు 3500 పడకలు ఉన్నాయి. మరో 1200 పడకలతో గచ్చిబౌలిలోని టిమ్స్ సిద్ధమైంది.
ఒక్క గాంధీలోనే 2వేల పడకలుంటే ఇప్పుడు 800 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. 719 మంది వైద్యులు రేయింబవళ్లూ వారి ప్రాణాలను కాపాడి ఇంటికి పంపిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎటువంటి సేవలందుతున్నాయంటే..
- ఫీవర్ ఆసుపత్రిలో 190 పడకలున్నాయి. మొదట్లో అనుమానితులకు మాత్రమే సేవలుండగా ఇప్పుడు పాజిటివ్ రోగులనూ అక్కున చేర్చుకుంటోంది.
- కింగ్‌కోఠిలో 350 పడకలున్నాయి. రోగులకు వైద్యం అందిస్తోంది. వందలమందికి పరీక్షలు చేస్తోంది.
- ఛాతీ ఆసుపత్రి అనుమానితులను చేర్చుకుని పరీక్షలు చేయించి లక్షణాలను బట్టి వివిధ ఆసుపత్రులకు పంపిస్తోంది. ఔషధాలూ ఇస్తోంది.
- అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయంలో 300 పడకలున్నాయి. రోజూ 200 మందికి పరీక్షలు చేస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రి 220 పడకలతో సేవలందిస్తోంది.
- ఉస్మానియాలో 60 పడకలతో ఐసోలేషన్ ఉంది. పాజిటివ్ ఉన్నవారిని వివిధ ఆసుపత్రులకు పంపిస్తోంది. సరోజినీదేవి ఆసుపత్రీ రోగులకు సేవలందిస్తోంది.
అండగా ఉంటున్నాం:
నిత్యం 200 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయిస్తున్నాం. 50మందికిపైగా పాజిటివ్ వస్తే వారందరికీ వైద్యం అందిస్తున్నాం. లక్షణాలు అధికంగా ఉంటే గాంధీకి, లేని పక్షంలో మావద్దే చికిత్స అందిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి తోడ్పాటుతో పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నాం.- డాక్టర్ శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
ఎంతమంది రోగులొచ్చినా: