Inspections On Pubs: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఈవీడీఎం తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమతులు, ఫైర్ నిబంధనలు పాటించని పబ్‌లలో ఇవాళ తనిఖీలు నిర్వహించారు. వీటితో పాటుగా వాణిజ్య సముదాయాల్లో దాడులు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఈవీడీఎం విశ్వజిత్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా ముద్రించిన ఫ్లెక్సీ ప్రింటింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం జూబ్లీహిల్స్‌లోని పబ్‌ను ఈవీడీఎం అధికారులు సీజ్ చేశారు.
పబ్‌లపై కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఈవీడీఎం తనిఖీలు - Hyderabad Pubs News
12:14 April 20
జీహెచ్ఎంసీ ఈవీడీఎం విశ్వజిత్ ఆధ్వర్యంలో అధికారుల తనిఖీలు
ఇటీవల పబ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్‌లు అసాంఘిక కార్యకలపాలకు నెలవుగా మారాయని వస్తున్న వార్తల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది. కొద్ది రోజుల క్రితం పబ్‌లో కొకైన్ పట్టుబడటంతో ఎక్సైజ్‌శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాడిసన్ బ్లూ హోటల్లో మద్యం అమ్మకాల అనుమతిని రద్దు చేసిన అధికారులు... మిగతా పబ్‌ల పైనా నిఘా పెట్టారు. పబ్ యాజమాన్యాల వైఖరి మారకపోతే అవసరమైతే ప్రత్యేక జీవో తీసుకొచ్చి అన్నిటినీ రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా గమనించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఇవాళ హైదరాబాద్ నగరంలో నిబంధనలు పాటించని వాణిజ్య సముదాయాలు, పబ్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. పబ్‌లను శుక్ర, శనివారాల్లో రాత్రి 1 గంటకు.. మిగిలిన రోజుల్లో 12 గంటలకు కచ్చితంగా మూసేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు మరోసారి గుర్తుచేశారు.
ఇదీ చూడండి: