తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. భారీగా వరద ప్రవాహం.. - Ongoing flow river Krishna

కృష్ణా నది ఉప్పొంగుతోంది. నారాయణపూర్‌ జలాశయం దిగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు 4.35 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వరద రాక అధికంగా ఉండటంతో జలాశయంలో నీటినిల్వను 8.63 టీఎంసీల స్థాయికి తగ్గించారు. అంతేస్థాయిలో ఇక్కడి నుంచి శ్రీశైలానికి విడుదలవుతుండగా మధ్యలో బీమా ఇతర నదుల కలయికతో వరద పెరిగింది.

Ongoing flow to the river Krishna
ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. భారీగా వరద ప్రవాహం..

By

Published : Sep 28, 2020, 8:35 AM IST

శ్రీశైలం జలాశయం వద్ద 5.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఇక్కడి నుంచి దిగువకు స్పిల్‌వే గేట్లద్వారా 5.94 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరీవాహకంలోనూ జలాశయాల గేట్లు తెరుచుకున్నాయి. శ్రీరామసాగర్‌ నుంచి 1.68 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి దిగువకు 2.22 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

‘సాగర్‌’లో 20 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్‌ జలాశయానికి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘శ్రీశైలం’ నుంచి 5,18,892 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ‘సాగర్‌’ జలాశయం నుంచి 20 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 5,59,260 క్యూసెక్కులను విడుదల చేశారు. గేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వ, ప్రధాన విద్యుత్కేంద్రం, ఎస్‌ఎల్బీసీ ద్వారా కలిపి మొత్తం 6,01,892 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

కాళేశ్వరం బ్యారేజీల నుంచి..

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీ 46గేట్లను ఎత్తి, సరస్వతి బ్యారేజీ 46గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details