ఎగువన కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం(flood to Irrigation projects) వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
ఎస్సారెస్పీ 33 గేట్లు ఎత్తివేత..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం(flood to Irrigation projects) కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు రాగా.. 33 గేట్లు ఎత్తి 2.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీలో 88.662 టీఎంసీల నీరు..
సాగర్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.9 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 84.291 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం వల్ల అప్రమత్తమైన అధికారులు ఐదు గేట్లు ఎత్తి 50,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 65,200 క్యూసెక్కులు ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు 5గేట్లు ఎత్తివేత..
నిజాంసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1403.5 అడుగులుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 15.66 టీఎంసీలు ఉండగా.. గరిష్ఠ నీటినిల్వ 17.8 టీఎంసీలు.
అప్రమత్తంగా ఉండండి..
వరద ప్రవాహం(flood to Irrigation projects) ఇలాగే కొనసాగితే మరి కొన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాలకు చెందిన గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.