ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మరో నలుగురు నిందితులపై అనిశా విచారణ కొనసాగుతోంది. బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయంలో రెండో రోజు అధికారులు విచారిస్తున్నారు. లైఫ్ కేర్ ఎండీ సుధాకర్‌రెడ్డి, ఆర్సీపురం ఈఎస్ఐ సీనియర్ అసిస్టెంట్ సురేంద్రబాబు...వెంకటేశ్వరా హెల్త్ సెంటర్ వైద్యుడు చెరకు అర్వింద్‌రెడ్డి, నాచారం ఈఎస్‌ఐ ఫార్మసిస్ట్ నాగలక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. మందుల కొనుగోళ్ల అక్రమాలు, క్యాంపుల ద్వారా దోచిన సొమ్ము వివరాలపై విచారణ జరుగుతోంది. నిందితుల బ్యాంక్ ఖాతాలపై అనిశా అధికారుల ఆధారాలు సేకరిస్తున్నారు. వీటితో పాటు పలు కీలక ఆధారాలు, సమాచారాన్ని అనిశా అధికారులు సంపాదించారు.
ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులపై కొనసాగుతున్న అనిశా విచారణ - telangana esi scam
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మరో నలుగురు నిందితులపై కస్టడీ కొనసాగుతోంది. మందుల కొనుగోళ్ల అక్రమాలు, క్యాంపుల ద్వారా దోచిన సొమ్ము వివరాలపై అనిశా అధికారులు విచారిస్తున్నారు.
మందుల కుంభకోణంలో నిందితులపై కొనసాగుతున్న అనిశా విచారణ