తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 12:32 PM IST

ETV Bharat / state

1,200 కేంద్రాల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా డ్రై రన్

రాష్ట్రవ్యాప్తంగా 12 వందల కేంద్రాల్లో కొవిడ్ టీకా డ్రై రన్ విజయవంతంగా కొనసాగుతోంది. కరోనా టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహించారు. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరు.. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సన్నద్ధత తదితర అంశాలపై దృష్టిసారిస్తున్నారు.

Ongoing covid vaccine dry run at 1,200 centers in telangana
1,200 కేంద్రాల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా డ్రై రన్

రాష్ట్రవ్యాప్తంగా 12 వందల కేంద్రాల్లో కొవిడ్ టీకా డ్రై రన్ విజయవంతంగా కొనసాగుతోంది. కరోనా టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహించారు. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరు.. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సన్నద్ధత తదితర అంశాలపై దృష్టిసారిస్తున్నారు.

12వందల కేంద్రంల్లో...

కొవిడ్‌ టీకా అందించే ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా డ్రైరన్‌ నిర్వహిస్తోంది. ఇప్పటికే తొలివిడతలో నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసి ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోనూ డ్రైరన్‌ను నిర్వహించారు. తాజాగా దేశవ్యాప్తంగా ప్రక్రియను పరిశీలిస్తున్న కేంద్రం.. అందులో భాగంగా రాష్ట్రంలో 12 వందల కేంద్రాల్లో టీకా మాక్‌డ్రిల్‌ జరుపుతున్నారు. కింగ్‌ కోఠి , ఉస్మానియా ఆస్పత్రుల్లో డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు.

కొ-విన్​ యాప్​లో...

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రతి కేంద్రంలో 25 మందికి టీకా అందించే ప్రక్రియ, అందులో తలెత్తే లోపాలను వైద్యులు పరిశీలిస్తున్నారు. వెరిఫికేషన్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ గదులు ఏర్పాటు చేశారు. వాలంటీర్ టీకా కేంద్రానికి వచ్చి తిరిగివెళ్లే వరకు 4 దశల ప్రక్రియ అమలు చేస్తున్నారు. కొ-విన్ యాప్‌లో నిక్షిప్తమైన లబ్ధిదారుల వివరాలు అధికారిక పత్రాలతో పరిశీలిస్తున్నారు. కొ-విన్ యాప్‌ సాంకేతిక సమస్యలపై మరోసారి పరిశీలన జరిపి పరిష్కారం చూపుతున్నారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల వారీగా ఏర్పాట్లు చేశారు. డ్రై రన్ తర్వాత మండలస్థాయిలో సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

కరోనా టీకా వేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్‌ సరఫరాకు ప్రయాణికుల విమానాలు వినియోగిస్తామని ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కోల్డ్‌చైన్‌ సిస్టంను ఏర్పాటు చేస్తోంది. ప్రక్రియంతా పూర్తియితే సంక్రాంతి నాటికే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details