హైదరాబాద్ నగరంలోని మాంసం దుకాణాలపై పశు సంవర్ధక శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ఖైరతాబాద్, మణికొండ, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని 8 మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని టెండర్ కట్స్ మటన్ దుకాణాన్ని సీజ్ చేశారు.
తాము తనిఖీ కోసం వెళ్లిన సమయంలో దుకాణం బయట నో మటన్ అని బోర్డు ఏర్పాటు చేశారని.. లోపలకి వెళ్లి పరిశీలించగా సుమారు 20 కిలోల మటన్ లభించిందని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బాబుబేరీ అన్నారు. ఆ మాంసం సైతం దుర్వాసన వస్తుందని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.