సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ఫ్లైఓవర్ పై నుంచి దూకి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో బేగంపేట కొత్త బ్రిడ్జి వద్దకు వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా పక్కనే ఉన్న మురికి నాళాలోకి దూకాడు. మృతుడు 25 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బేగంపేట ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య - FLYOVER
ఇవాళ ఉదయం 7 గంటలకు బేగంపేట ఫ్లైఓవర్ పైనుంచి మురికి నాళాలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
బేగంపేట ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య