తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలోనూ.. ఈనెలాఖరు వరకు లాక్​​డౌన్ - ఏపీలోనూ.. ఈనెలాఖరు వరకు లాక్​​డౌన్

ఈనెల 31 వరకు ఏపీలో లాక్​డౌన్​ను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 29న రేషన్ సరకులు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.

ఏపీలోనూ.. ఈనెలాఖరు వరకు లాక్​​డౌన్
ఏపీలోనూ.. ఈనెలాఖరు వరకు లాక్​​డౌన్

By

Published : Mar 22, 2020, 8:19 PM IST

ఏపీలో లౌక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి కిలో పప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ. వెయ్యి అందిస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్లు ఇంటికెళ్లి నగదును అందజేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 29న రేషన్ సరకులు అందిస్తామని స్పష్టం చేశారు.

జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉందని జగన్​ ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వెంటనే 104కు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు. నిత్యవసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్​ను ఆమోదిస్తామని... అసెంబ్లీని కూడా కొన్ని రోజులపాటే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమన్న సీఎం జగన్... అందరితోపాటు బస్సులు, వాహనాలు నిలిపివేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details