ఇంటర్ పరీక్షల్లో ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఇంటర్‌బోర్డు చేసిన మరో తప్పు ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈనెల 12న ఇంటర్ రెండో సంవత్సరం వృక్షశాస్త్రం పరీక్ష జరగ్గా... ఒక ప్రశ్నను ముద్రించడమే మరిచిపోయింది. ప్రశ్నపత్రంలోని సెక్షన్-ఏలో రెండు మార్కుల ప్రశ్నలు 15 ఇవ్వాలి. అందులో విద్యార్థులు ఏవైనా 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అందులో 14 ప్రశ్నలే ఇచ్చారు.
'ఇంటర్ సెకండియర్ క్వశ్చన్ పేపర్లో ఒకటి తక్కువైంది!' - mistake in telangana inter second year question paper
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగతున్నాయి. ఈ పరీక్షల్లో మరో తప్పు ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈనెల 12న ఇంటర్ రెండో సంవత్సరం వృక్షశాస్త్రం పరీక్ష జరగ్గా.. అందులో ఓ ప్రశ్న మిస్ అయింది.

one question leave in inter second year question paper in telangana
తొమ్మిదో ప్రశ్న తర్వాత పదకొండోది ముద్రించారు. అంటే పదో ప్రశ్న మాయమైంది. ఆంగ్ల మాధ్యమంలో మాత్రం ముద్రించారు. ఈసారి ఛాయిస్ పెంచడంతో విద్యార్థులు కూడా పెద్దగా పట్టించుకోలేదని అధ్యాపకుడు ఒకరు తెలిపారు. ఇంటర్‌బోర్డు మాత్రం ఈసారి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని చెప్పుకుంటోంది.