దిల్లీ తరహా అల్లర్లు సృష్టించేందుకు భాగ్యనగరానికి కొందరు వచ్చారంటూ... సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న రెహమత్ షరీఫ్ అనే ఆటో డ్రైవర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెహమత్ షరీఫ్ వదంతులతో కూడిన ఓ ఆడియోను సోషల్ మీడియాలో పెట్టగా... అది వైరల్ అయింది.
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం... ఒకరి అరెస్ట్ - Social Media Rumors One Man Arrest
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ఒకరిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు వదంతులను ఎవరూ ప్రచారం చేయవద్దని నగర కమిషనర్ తెలిపారు.
Fake One Arrest
ఈ విషయాన్ని ఎంబీటీ పార్టీ హైదరాబాద్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. నిందితుని సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు అతన్ని ట్రేస్ చేసి... అదుపులోకి తీసుకున్నారు. నగరవాసులను భయబ్రాంతులకు గురిచేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలు, వదంతులను ఎవరూ ప్రచారం చేయవద్దని సీపీ కోరారు.
ఇదీ చూడండి :తిరుమలగిరిలో ఓ వివాహిత అదృశ్యం