Inevestments in Telangana: హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ మరో భారీ పెట్టుబడితో ముందుకు రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతో 14 బిలియన్ డోస్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసేలా ప్రపంచంలోని ఏకైక ప్రాంతంగా హైదరాబాద్ నిలవనుందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే "వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్"గా పేరు పొందందని హర్షం వ్యక్తం చేశారు. ఈ విస్తరణ వల్ల 2500 మందికి ఉపాధి లభించనుందని మంత్రి ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలను బయోలజికల్ ఈ-సంస్థ ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో మరో రూ.1800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. మంత్రి కేటీఆర్‌తో భేటీలో... టీకాలు, ఏపీఐలు, ఫార్ములేషన్ల తయారీ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు బయోలజికల్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్ల ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌తో భేటీలో ప్రకటించిన బయోలజికల్ ఈ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
'కూ' తో ఒప్పందం:సామాజిక మాధ్యమాలు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉంటే ప్రభుత్వం అదనంగా మరింత వేగంగా, మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల డౌన్లోడ్స్ ఉన్న ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ 'కూ' తెలంగాణలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేటీఆర్ సమక్షంలో కూ ప్రతినిధులు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ప్రస్తుతం దేశంలో హిందీ, తెలుగు సహా 10 భాషల్లో.. స్థానిక భాషలో వీడియోలు, ప్రాంతీయ భాషల్లో రాసి పోస్టు చేసే అవకాశం ఉన్నందున కూ సంస్థ భవిష్యత్తులో మరిన్ని భాషలకు విస్తరింపజేయనుంది. ప్రతి విషయాన్ని ట్విట్టర్ తరహాలో పోస్ట్ చేసుకునే అవకాశాన్ని, మరిన్ని ఆప్షన్లను కలిగి ఉండటం 'కూ' యాప్ ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఇవీ చదవండి:విద్యార్థిని చితకబాదిన వ్యాయామ ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే.!
'రాష్ట్రపతి ఎన్నిక' ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ పూర్తి.. ముర్ముకు భారీ ఆధిక్యం!