ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి - ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి
18:13 June 29
ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి
హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందారు. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని తమకు ఇవ్వడంలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని అప్పగించాలంటే నిబంధనలు పూర్తి చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ వెల్లడించారు.
కరోనా నిబంధనలు అనుసరిస్తూనే మృతదేహాన్ని అందిస్తామని... వాటిని పూర్తి చేసేందుకు సమయం పడుతుందని ఆయన తెలిపారు. నిబంధనలు పూర్తి చేసే సమయంలోనే బంధువులు నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపిస్తున్నారంటూ మహబూబ్‌ఖాన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!