భర్త అనుమానిస్తున్నాడని ఓ వివాహిత ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్నగర్లో నివాసం ఉంటున్న మనోహర్, అనురాధ దంపతులకు గత 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. గత ఆరు నెలల నుంచి తన భార్య ఒక వ్యక్తితో చరవాణిలో తరచుగా మాట్లాడుతూ ఉందని అతను పోలీసులకు తెలిపాడు. తరచుగా ఫోన్ మాట్లాడటం వల్ల వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరిగేవని మనోహర్ అన్నాడు. గత కొన్ని రోజుల క్రితం తన భార్యకు సర్ది చెప్పినప్పటికీ ఆమె తన మాట వినలేదని చెప్పాడు.
చరవాణిలో ఎక్కువగా మాట్లాడొద్దని భర్త మందలింపు.. ఇంటిని వదిలిన వివాహిత... - వివాహిత అదృష్యం
చరవాణిలో ఎక్కువగా మాట్లాడుతున్నావ్ అని అన్నందుకు ఓ వివాహిత ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నిన్న మధ్యాహ్నం సమయంలో మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ రావడం వల్ల ఆమె అతనితో మాట్లాడింది. ఎందుకు తరచూ మాట్లాడుతున్నావ్ అనే విషయంపై భార్యాభర్తలిద్దరికీ మళ్లీ గొడవ జరగడం వల్ల ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై బంధువులను స్నేహితులను ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. భర్త మనోహర్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..?